ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో వికెట్‌ అవుట్‌..

ABN, First Publish Date - 2022-06-24T16:01:51+05:30

రాష్ట్ర శాసనసభకు మరో పదినెలలో ఎన్నికలు ఉండగా జేడీఎస్‏ను వీడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత వారం కిందట జరిగిన రాజ్యసభ ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- Jds నుంచి మరో నేత 

- కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్సీ శ్రీనాథ్‌


బెంగళూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభకు మరో పదినెలలో ఎన్నికలు ఉండగా జేడీఎస్‏ను వీడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత వారం కిందట జరిగిన రాజ్యసభ ఎన్నికల వేళ ఇరువురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంతో వారిపై వేటు వేశారు. ఈలోగానే కొప్పళ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఆర్‌ శ్రీనాథ్‌ పార్టీకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. గురువారం గంగావతిలో మీడియాతో మాట్లాడుతూ జూలై 3న కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని ఆయన స్వయంగా తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికలలో గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‏లో చేరే విషయమై ఇదే నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇక్బాల్‌ అన్సారీతో చర్చించలేదన్నారు. సీనియర్‌ నేతల చర్చలు జరుపుతారన్నారు. ఎవరికి టికెట్‌ ఇవ్వరాదనేది నేను చెప్పలేనన్నారు. అంజనాద్రిని బీజేపీ నాయకులు టార్గెట్‌ చేశారని దీన్ని తిప్పికొట్టేందుకే కాంగ్రెస్‏లో చేరదలచినట్లు తెలిపారు. హిందూ ముస్లింలను వేరు చేసేందుకు బీజేపీ కుట్ర సాగిస్తోందన్నారు.

Updated Date - 2022-06-24T16:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising