ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Presidential Poll : Droupadi Murmu కి జేడీఎస్ మద్ధతు.. త్వరలోనే తుది నిర్ణయం..

ABN, First Publish Date - 2022-06-30T17:00:37+05:30

కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్)(JDS) నేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumara swammy) కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్)(JDS) నేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumara swammy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Poll) ఎన్‌డీఏ(NDA) బలపరిచిన అభ్యర్థి ద్రౌపతి ముర్ము(Droupadi Murmu)కి జేడీఎస్(JDS) మద్ధతిస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రపతి(President) రేసులో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల నేపథ్యం పరిశీలించి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని, జేడీఎస్ దిగ్గజనేత హెచ్‌డీ దేవెగౌడ(HD Devegowda)తో ద్రౌపతి ముర్ము ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతివ్వాలని ఆమె అభ్యర్థించారు. వ్యక్తిగతంగా కలిసేందుకు సమయమివ్వాలని ఆమె కోరారని తెలిపారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న దేవేగౌడతో ముర్ము 2 సార్లు మాట్లాడారు. మద్దతివ్వాలని కోరారని వివరించారు. అయితే వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరంలేదని కుమారస్వామి ఆమెకి సూచించారు. ముర్ము వైపు ఇప్పటికే మెజారిటీ ఉంది. అయినప్పటికీ మన:పూర్వకంగా ఒకసారి దేవేగౌడను కలవాలని భావిస్తున్నట్టు ముర్ము చెప్పారని  ఆయన వివరించారు.


‘ ముర్ము ఇప్పటికే గెలిచారు. ఇంతదూరం రావాల్సిన అవసరం లేదు. పార్టీలో నిర్ణయించుకుంటాం. మా నిర్ణయం ఏంటో మీరు(మీడియా) అర్థంచేసుకోవచ్చు. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు ఇరువురు అభ్యర్థుల పూర్వాపరాలను ఓసారి పరిశీలిస్తాం. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్సా లేదా బీజేపీ లేదా బీ-టీం అన్నది ముఖ్యం కాదు. ముర్ము నేపథ్యం, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నామన్నారు. కాగా కుమారస్వామి ఇటివల కూడా ముర్ముకి మద్ధతుగా పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవికి ముర్ము తగిన వ్యక్తి, ఎలాంటి వివాదాలూ లేని అభ్యర్థి అని ఆయన వ్యాఖ్యానించారు. ముర్ముని గిరిజన అభ్యర్థిగా పేర్కొవాల్సిన అవసరంలేదని, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అభ్యర్థిగా మాత్రమే పేర్కొనాలని చెప్పారు.


కాగా జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగారు. ద్రౌపతి ముర్ము ఒడిశాకు చెందినవారు. 64 ఏళ్ల వయసున్న ఆమె ఇదివరకు జార్ఖండ్ గవర్నర్‌గా, ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా విపక్షాల రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఉన్నారు. సిన్హాకు కాంగ్రెస్, ఎన్‌సీపీ, టీఎంసీ, టీఆర్‌ఎస్ సహా ఇతర పార్టీలు మద్ధతిస్తున్నాయి.  ఇప్పటికే ఇరువురు అభ్యర్థులూ నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - 2022-06-30T17:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising