ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Investigation: శశికళ, మాజీ సీఎస్ విచారణకు త్వరలో ప్రత్యేక కమిటీ

ABN, First Publish Date - 2022-08-31T14:40:45+05:30

మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సిఫారసు మేరకు ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సిఫారసు మేరకు ఆమె సన్నిహితురాలు శశికళ, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, జయ వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌లను విచారణ జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నలుగురిని విచారించేందుకు రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి నేతృత్వంలో ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ దర్యాప్తు బృందంలో ఓ సీనియర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐని కూడా సభ్యులుగా నియమించనున్నారు. ఈ ప్రత్యేక బృందం శశికళ, రామ్మోహనరావు(Sasikala, Rammohana Rao) తదితరులకు నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరకావాలంటూ సమన్లు పంపనుంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశం మేరకు ఈ బృందం నెలరోజుల్లో ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ఈ నలుగురిని విచారిస్తే జయ మృతిపై విచారణ సంపూర్ణమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విచారణ పూర్తయిన తర్వాతే జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ రూపొందించిన నివేదికను శాసనసభ ముందుంచనున్నారు. 

Updated Date - 2022-08-31T14:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising