ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియాలో జపాన్ భారీ పెట్టుబడులు

ABN, First Publish Date - 2022-03-19T21:56:39+05:30

జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా రెండు రోజుల భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మన దేశంలో పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా రెండు రోజుల భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మన దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధమైంది. జపాన్ మీడియా కథనం ప్రకారం ఇండియాలో జపాన్ ఐదేళ్లపాటు 42 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఫ్యుమియో ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. దీంతోపాటు 300 బిలియన్ల జపాన్ యెన్లు రుణంగా అందించేందుకు కూడా జపాన్ ప్రతిపాదించనుంది. కర్బన ఉద్గారాల తగ్గింపులో సహకారాన్ని జపాన్ అందించనుంది. మోదీతో సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఫ్యుమియో చర్చిస్తారు. జపాన్-ఇండియా వ్యూహాత్మక భాగస్వాములని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి 70 ఏళ్లు పూర్తవుతున్నాయని ఫ్యుమియో అన్నారు. ఆయన ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇండియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

Updated Date - 2022-03-19T21:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising