ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Most Favored Nation జాబితా నుంచి రష్యాను తొలగించిన జపాన్

ABN, First Publish Date - 2022-03-17T02:10:14+05:30

ఉక్రెయిన్‌పై దురాక్రమణ సాగిస్తున్న రష్యా చుట్టూ ప్రపంచ దేశాల ఆంక్షల చట్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఉక్రెయిన్‌పై దురాక్రమణ సాగిస్తున్న రష్యా చుట్టూ ప్రపంచ దేశాల ఆంక్షల చట్రం బిగుస్తోంది. తాజాగా ఆ దేశంపై జపాన్ మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యాకు తాము కల్పించిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్టు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బుధవారంనాడు ప్రకటించారు. రష్యాకు లగ్జరీ ప్రోడక్ట్‌ల సరఫరాను, ఎంపిక చేసిన రష్యా వస్తువుల దిగుమతిని నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఐఎంఎఫ్‌తో సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రష్యాకు రుణాలు లభించకుండా అడ్డుకునేందుకు జపాన్ తమ వంతు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తుందని చెప్పారు.


కాగా, ఇప్పటికే మాస్కోపై జపాన్ పలు ఆంక్షలు అమలు చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉన్నతాధికారులు, పుతిన్‌కు సన్నిహితంగా ఉండే బిలియనీర్ల ఆస్తులను స్తంభింపజేసింది. మిలటరీ ప్రయోజనాల కోసం వినియోగించే అత్యున్నత స్థాయి సాంకేతిక వస్తువుల ఎగుమతులను నిషేధించింది. మరోవైపు, ఉక్రయెన్‌ నుంచి పొరుగుదేశాలకు పారిపోతున్న ప్రజల కోసం మానవతా సాయాన్ని మరింత పెంచుతున్నట్టు కిషిడ తెలిపారు. మందులు, సహాయ సామగ్రి వంటి మానవతాసాయాన్ని నౌకల ద్వారా ఉక్రెయిన్‌కు జపాన్ పంపుతోంది.

Updated Date - 2022-03-17T02:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising