ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat riots కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ arrest

ABN, First Publish Date - 2022-07-13T13:27:31+05:30

గుజరాత్ అల్లర్ల కేసులో(Gujarat riots) మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను(ex IPS officer Sanjiv Bhatt) అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ అల్లర్ల కేసులో(Gujarat riots) మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను(ex IPS officer Sanjiv Bhatt) అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి అహ్మదాబాద్ తరలించారు.ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి ఆర్బీ శ్రీకుమార్‌లను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొన్ని రోజుల తరువాత, జైలులో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను గుజరాత్ అల్లర్ల కేసులో మళ్లీ అరెస్టు చేశారు.1990వ సంవత్సరంలో కస్టడీ మరణానికి సంబంధించి జామ్‌నగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించిన తర్వాత పాలన్‌పూర్ జైలులో ఉన్న సంజీవ్ భట్‌ను క్రైమ్ బ్రాంచ్ అహ్మదాబాద్‌కు తీసుకెళ్లింది.


2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాధారాల ఆరోపణలపై ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్బీ శ్రీకుమార్‌లను అరెస్టు చేశారు.సుప్రీంకోర్టు తన తీర్పులో తప్పుడు సాక్ష్యాలను చూపినందుకు ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లను కొనసాగించేందుకు వీలుగా అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలకు సంబంధించి ఆర్‌బీ శ్రీకుమార్, సంజీవ్ భట్ ఇచ్చిన వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ సమయంలో సీనియర్ అధికారుల చర్యలపై సిట్ సమగ్ర దర్యాప్తు జరిపిందని ధర్మాసనం పేర్కొంది.


సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీస్తా సెతల్వాద్, సంజీవ్ భట్, ఆర్‌బీ శ్రీకుమార్‌లపై కేసు నమోదు చేసింది.పోలీసులు ముగ్గురు నిందితులపై సెక్షన్లు 468, 471, 194, 211,  218 ల కింద పోలీసులు అభియోగాలు మోపారు. 


Updated Date - 2022-07-13T13:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising