ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22,850 అడుగుల ఎత్తున యోగా చేసి రికార్డు సృష్టించిన ITBP

ABN, First Publish Date - 2022-06-06T23:09:43+05:30

అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) పర్వతారోహకులు రికార్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) పర్వతారోహకులు రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో 22,850 అడుగుల ఎత్తున యోగా చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 14 మందితో కూడిన ఐటీబీపీ పర్వతారోహకుల బృందం గతవారం అబి గమిన్ పర్వత శిఖరాగ్రానికి చేరుకుంది.


ఈ నెల 1న విపరీతమైన మంచు కురుస్తుండగా 20 నిమిషాలపాటు యోగా చేసి సరికొత్త  రికార్డు నెలకొల్పారు. అత్యంత ఎత్తైన ప్రదేశంలో యోగాను సాధన చేయడంలో సరికొత్త రికార్డు సృష్టించినట్టు తెలిపింది.ఇంత ఎత్తులో ఇప్పటి వరకు ఎవరూ యోగా చేయలేదని, తొలిసారి తామే ఆ ఘనత సాధించినట్టు ఐటీబీపీ తెలిపింది.


అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న దృష్టి.. ‘మానవత్వం కోసమే యోగా’ అన్న థీమ్ తమకు ప్రేరణ ఇచ్చిందని ఈ సందర్భంగా ఐటీబీపీ పేర్కొంది. అంతెత్తున వివిధ యోగాసనాలు వేయడం ద్వారా ప్రజలు ఫిట్‌గా ఉండాలన్న సందేశాన్ని ఇచ్చినట్టు వివరించింది. యోగాకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఐటీబీపీ సంవత్సరాలుగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాలకుని యోగాసనాలు వేస్తోంది. కాగా, హిమాలయ పర్వత శ్రేణుల్లో సాధించిన ఈ ఘనతను ఐటీబీపీ దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Kooలో యోగా చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది.  

Updated Date - 2022-06-06T23:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising