ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Italian PM Mario Draghi రాజీనామాను తిరస్కరించిన దేశాధ్యక్షుడు

ABN, First Publish Date - 2022-07-15T17:04:19+05:30

ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రఘి (Mario Draghi) రాజీనామాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్ : ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రఘి (Mario Draghi) రాజీనామాను ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మట్టరెల్ల తిరస్కరించారు. దాదాపు 18 నెలల క్రితం అధికారం చేపట్టిన నేషనల్ యూనిటీ (National Unity) ప్రభుత్వాన్ని కూలదోస్తామని 5 స్టార్ మువ్‌మెంట్ (5 Star Movement) అనే సంకీర్ణ కూటమిలోని పార్టీ బెదిరించడంతో మారియో తాను రాజీనామా చేస్తానని చెప్పారు. 


మారియో డ్రఘి గతంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. పెరుగుతున్న ధరలపై పోరాడేందుకు ఆయన రచించిన ప్రణాళికను అమలు చేసేందుకు విశ్వాస పరీక్షలో ఆయనకు మద్దతిచ్చేందుకు 5 స్టార్ మువ్‌మెంట్ తిరస్కరించింది. తన ప్రభుత్వానికి మద్దతిచ్చిన నేషనల్ యూనిటీ కూటమి ఇక లేదని మారియో ప్రకటించారు. ఈ విస్తృత కూటమి ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. 


మారియో డ్రఘి (74) గురువారం రోమ్‌ (Rome)లోని క్విరినేల్ పేలస్‌కు వెళ్ళి, దేశాధ్యక్షుడు సెర్గియో మట్టరెల్ల (Sergio Mattarella)కు రాజీనామా సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను మట్టరెల్ల తిరస్కరించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పార్లమెంటుకు పూర్తిగా వివరించాలని కోరారు. 


ఇటలీలో సాధారణ ఎన్నికలు 2023 ప్రారంభంలో జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలో జీవన వ్యయం పెరుగుదల, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి అంశాల్లో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. 


Updated Date - 2022-07-15T17:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising