ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు మంత్రులు బీజేపీకి పెద్ద విషయం కాదు: కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2022-01-14T22:46:56+05:30

భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి మా పార్టీకి గట్టి మద్దతు ఉంది. ప్రజల్లో బీజేపీపై మంచి ఆదరణ ఉంది. ప్రజల మళ్లీ బీజేపీని ఆదరిస్తారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముగ్గురు మంత్రులు రాజీనామా చేస్తే భారతీయ జనతా పార్టీకి జరిగే నష్టమేం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు సహా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు. వీరిలో ఇద్దరు మంత్రులు సహా నలుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీపై వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు.


‘‘భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి మా పార్టీకి గట్టి మద్దతు ఉంది. ప్రజల్లో బీజేపీపై మంచి ఆదరణ ఉంది. ప్రజల మళ్లీ బీజేపీని ఆదరిస్తారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. కొంత మంది నాయకులు బయటికి వెళ్లడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలో వందల మంది నేతలు ఉన్నారు. వందల మంది నేతల్ని పార్టీ తయారు చేసుకుంటుంది’’ అని తోమర్ అన్నారు.

Updated Date - 2022-01-14T22:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising