ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపక్షాల ఎంపికపై Margaret Alva ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2022-07-18T00:23:15+05:30

విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా (Margaret Alva) ఓ ట్వీట్‌లో స్పందించారు. ఇది తనకు దక్కిన గౌరవం(honour)గా భావిస్తున్నానని అన్నారు. విపక్షాల నిర్ణయాన్ని హుందాగా స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో ఆదివారంనాడు 17 పార్టీల నేతలు సమావేశమై మార్గరెట్ ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు. అనంతరం ఆ నిర్ణయాన్ని శరద్ పవార్ మీడియాకు వెల్లడించారు. తర్వాత కొద్ది సేపటికే మార్కరెట్ ఆల్వా ఓ ట్వీట్‌లో తన సంతోషం వ్యక్తం చేశారు.


''భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని హుందాగా స్వీకరిస్తున్నారు. నాపై విశ్వాసం ఉంచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన విపక్ష నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను... జైహింద్'' అని ఆ ట్వీట్‌లో మార్గరెట్ ఆల్వా తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో సహా 19 పార్టీల మద్దతు లభించిన ఆల్వా...ఈనెల 19న నామినేషన్ వేయనున్నారు.

Updated Date - 2022-07-18T00:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising