ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

fireworks: ఐల్యాండ్‌ గ్రౌండ్‌లో బాణసంచా దుకాణాలు

ABN, First Publish Date - 2022-10-11T15:48:51+05:30

దీపావళిని పురస్కరించుకొని ఐల్యాండ్‌ గ్రౌండ్‌(Island ground)లో బాణసంచా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. వీటిని ఈ నెల 17 లోగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై), అక్టోబరు 10: దీపావళిని పురస్కరించుకొని ఐల్యాండ్‌ గ్రౌండ్‌(Island ground)లో బాణసంచా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. వీటిని ఈ నెల 17 లోగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఇక్కడ దుకాణాలు ఏర్పాటుచేసి బాణసంచా విక్రయిస్తుంటారు. కాగా, ఈ నెల 24, దీపావళి సందర్భంగా 40 స్టాల్స్‌ ఏర్పాటుచేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో దుకాణానికి మధ్య పదడుగుల దూరం పాటించనున్నారు. ఈ విషయమై జార్జిటౌన్‌ వ్యాపారుల సంక్షేమ సంఘ అధ్యక్షులు అనీస్‏రాజా మాట్లాడుతూ, ఈ సంవత్సరం అన్ని భద్రతా చర్యలు తీసుకుని దుకాణాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. 14 నుంచి 17వ తేదిలోగా దుకాణాలు ప్రారంభించనున్నామన్నారు. బాణసంచా విక్రయాలు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) లేదా మంత్రులు శేఖర్‌బాబు, మదివేందన్‌ ప్రారంభించనున్నారని తెలిపారు. దుకాణాలు ప్రారంభించిన రోజు నుంచి 21వ తేది వరకు బాణసంచా కొనుగోలుపై 25 శాతం రాయితీ ప్రకటించామన్నారు. శబ్ధ, వాయుకాలుష్యం ఎక్కువగా కలిగించని విధంగా ఈ సారి బాణసంచా తయారుచేయించామని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-11T15:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising