ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు పట్టాల విధ్వంసానికి ఐఎ్‌సఐ కుట్ర!

ABN, First Publish Date - 2022-05-24T09:10:46+05:30

దేశంలో విధ్వంసాలకు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ఐఎ్‌సఐ మరో కుట్ర పన్నినట్లు భారత నిఘా సంస్థ(ఐబీ) సోమవారం హెచ్చరికలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లో అలెర్ట్‌

న్యూఢిల్లీ, మే 23: దేశంలో విధ్వంసాలకు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ఐఎ్‌సఐ మరో కుట్ర పన్నినట్లు భారత నిఘా సంస్థ(ఐబీ) సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఖలిస్థానీ వేర్పాటు వాదులు, కొత్త ఉగ్రవాద సంస్థ లష్కరే ఖల్సాతోపాటు.. మిలిటెంట్‌ గ్రూపులు సిక్స్‌ ఫర్‌ జస్టి్‌స(ఎ్‌సఎ్‌ఫజే), బబ్బర్‌ ఖల్సాకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాద నిద్రాణ దళాలు(స్లీపర్‌సెల్స్‌) ద్వారా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైల్వే ట్రాకులే టార్గెట్‌గా కుట్రపన్నినట్లు వెల్లడించింది. గూడ్స్‌ రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు పేల్చేసి, భారీ నష్టం వాటిల్లేలా వ్యూహాలు పన్నిందని తెలిపింది. రైల్వే ట్రాకుల వెంబడి పెట్రోలింగ్‌, నిఘా పెంచాలని సూచించింది. ఐఎ్‌సఐ ప్రేరేపిత ఉగ్రవాదులు, మిలిటెంట్లు జమ్మూకశ్మీర్‌లో విఫలమవుతున్న నేపథ్యంలో.. పాక్‌ నిఘా సంస్థ పంజాబ్‌పై దృష్టి సారించిందని వెల్లడించింది. మరోవైపు.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్లీపర్‌సెల్స్‌ ద్వారా రైలు పట్టాలను పేల్చేందుకు ఐఎ్‌సఐ కుట్రపన్నినట్లు ఐబీ హెచ్చరించింది. 

Updated Date - 2022-05-24T09:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising