ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IRCTC scam: తేజస్వి యాదవ్‌‌కు బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సీబీఐ

ABN, First Publish Date - 2022-09-17T21:31:12+05:30

రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణం కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణం కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav)పై సీబీఐ (CBI) శనివారంనాడు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ కేసులో తేజస్వికి ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని  కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ విజ్ఞప్తిపై సమాధానం ఇవ్వాలని తేజస్వి యాదవ్‌‌కు ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నోటీసు పంపారు.


తేజస్వి యాదవ్ ఇటీవల జరిపిన మీడియా సమావేశంలో తమ అధికారులను బెదిరించేలా మాట్లాడారని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఐఆర్‌సీటీసీ కేసులో తేజస్వి, ఆయన తల్లి రబ్రీదేవికి 2018 ఆగస్టులో బెయిల్ మంజూరైంది.


ఐఆర్‌సీటీసీ హోటల్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుకు సంబంధించిన కేసు ఇది. 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2006లో రాంచీ, ఒడిశాలోని పూరీలో ఐఆర్‌సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగాయని సీబీఐ అభియోగం. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఛార్జిషీటు నమోదు చేసింది.

Updated Date - 2022-09-17T21:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising