ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొద్దుబోయే వరకు విచారణ

ABN, First Publish Date - 2022-08-17T06:42:50+05:30

ఒక మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవుల మంజూరు విషయమై వచ్చిన కేసులో సుప్రీంకోర్టు సమయానికి మించి విచారణ జరిపింది. ధర్మాసనాలు సాధారణంగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం నిర్ణయం.. 

ఉద్యోగిని ప్రసూతి సెలవులపై వాదనలు విన్న కోర్టు


న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఒక మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవుల మంజూరు విషయమై వచ్చిన కేసులో సుప్రీంకోర్టు సమయానికి మించి విచారణ జరిపింది. ధర్మాసనాలు సాధారణంగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. అయితే ముఖ్యమైన విషయం కావడంతో మంగళవారం జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎ్‌స.బోపన్నల ధర్మాసనం మాత్రం సాయంత్రం 6.40 గంటల వరకు వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించింది. 


సెలవుల మంజూరుపై స్పష్టత 

సెంట్రల్‌ సర్వీసెస్‌ లీవ్‌ రూల్స్‌-1972 ప్రకారం ఉద్యోగినికి ఒక సంతానం వరకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకొంది. చిన్న పిల్ల పోషణ నిమిత్తం ప్రసూతి సెలవులు తీసుకొంది. అనంతరం తాను గర్భం ధరించగా సెలవులు పొందడానికి అర్హత పొందలేకపోయింది. రూల్‌ 43 ప్రకారం ప్రసూతి సెలవులు ఇవ్వడం కుదరదని సంబంధిత అధికారులు తెలిపారు. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించింది. మాతృత్వం జీవితంలో సహజ పరిణామని తెలిపింది. ఉద్యోగం కారణంగా ఆ వరానికి ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-08-17T06:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising