ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraineలో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ

ABN, First Publish Date - 2022-03-03T13:42:00+05:30

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హేగ్:ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ చెప్పారు. ‘‘రష్యా యుద్ధంపై దర్యాప్తు చేయాలనే నా నిర్ణయాన్ని  కొద్ది క్షణాల క్రితం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రెసిడెన్సీకి తెలిపాను. సాక్ష్యాధారాల సేకరణతో మా పని ప్రారంభించాం’’ అని ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.కోర్టు పరిధిలో నేరాలను నిర్ధారించనున్నారు.పలు పాశ్చాత్య దేశాలు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ఖండించాయి. యుద్దానికి వ్యతిరేకంగా పలు దేశాలు మాస్కోపై ఆంక్షల ఒత్తిడిని పెంచాయి.ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించినా, ఇంకా కైవ్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టలేదు. ఈ సైనిక దాడిలో వేలాది మంది ప్రజలు మరణించారని, పలువురు గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు.




Updated Date - 2022-03-03T13:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising