ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindu Sentiments Row : ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ సన్మాన కార్యక్రమం రద్దు

ABN, First Publish Date - 2022-07-30T23:23:25+05:30

ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ (International Booker Prize) విజేత గీతాంజలి శ్రీ (Geetanjali Shree

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా : ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ (International Booker Prize) విజేత గీతాంజలి శ్రీ (Geetanjali Shree) సన్మాన కార్యక్రమం రద్దయింది. సాంస్కృతిక సంస్థలు రంగ్లీలా, ఆగ్రా థియేటర్ క్లబ్ (Agra Theatre Club) ఆమెను శనివారం సత్కరించేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే ఆమె రచించిన నవలలో హిందూ దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ పిటిషన్ దాఖలవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 


రంగ్లీలా (Rangleela) ప్రతినిధి అనిల్ శుక్లా మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీపై హత్రాస్ జిల్లాకు చెందిన సందీప్ కుమార్ పాఠక్ ఫిర్యాదు చేశారని చెప్పారు. శివపార్వతులపై గీతాంజలి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారని తెలిపారు. ఈ నేపథ్యంలో గీతాంజలిని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రద్దు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమం రద్దవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోందన్నారు.


ఈ కార్యక్రమం అధికార ప్రతినిధి రాంభరత్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, గీతాంజలి శ్రీ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నాయని పాఠక్ ఫిర్యాదులో ఆరోపించారని చెప్పారు. గీతాంజలిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఆయన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) కు, డీజీపీకి ఓ ట్వీట్ చేశారని తెలిపారు. 


గీతాంజలి శ్రీ రచించిన ‘రెట్ సమాధి’ నవలకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది. ఓ భారతీయ భాషలో ఈ బహుమతిని గెలుచుకున్న మొదటి రచయిత్రి ఆమె. ఈ నవలను ‘‘టోంబ్ ఆఫ్ శాండ్’’ (Tomb of Sand) పేరుతో డైసీ రాక్‌వెల్ ఆంగ్లంలోకి అనువదించారు. 


ఈ నవలలో 80 ఏళ్ళ మహిళ కథను రసవత్తరంగా రాశారు. ఆమె పాకిస్థాన్ వెళ్ళేందుకు పట్టుబడుతూ ఉండటాన్ని ఆసక్తికరంగా రాశారు. ఆమె టీనేజ్ వయసులో దేశ విభజన జరిగింది. అప్పట్లో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. 


Updated Date - 2022-07-30T23:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising