ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IndiGo flightలో సాంకేతిక లోపం...నాగపూర్‌లో అత్యవసర ల్యాండింగ్

ABN, First Publish Date - 2022-04-05T12:52:18+05:30

సాంకేతిక లోపం కారణంగా లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్ : సాంకేతిక లోపం కారణంగా లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.విమానం నుంచి పొగలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.6ఈ-7074 నంబరు గల ఇండిగో విమానం నాగ్‌పూర్ నుంచి లక్నోకు వెళ్లాల్సి ఉండగా నాగ్‌పూర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఇండిగో ఎయిర్‌లైన్ తెలిపింది. ‘‘ఇండిగో నాగ్‌పూర్-లక్నో విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్య కారణంగా తిరిగి నాగపూర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. పైలట్‌లు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి నాగ్‌పూర్ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.


 ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు’’ అని ఎయిర్‌లైన్ తెలిపింది.భారత వైమానిక దళం దేశవ్యాప్తంగా 28 రహదారులపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాలను గుర్తించిందని కేంద్ర రోడ్డు రవాణ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతవారం రాజ్యసభలో ప్రకటించారు.పశ్చిమబెంగాల్‌,ఆంధ్రప్రదేశ్‌,గుజరాత్‌,రాజస్థాన్‌,బీహార్‌,హర్యానా,జమ్మూ కాశ్మీర్‌,తమిళనాడు,పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో రోడ్లపై ఎమర్జెన్సీ ల్యాండింగ్  సౌకర్యాలున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2022-04-05T12:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising