ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Patna: పాట్నాలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ABN, First Publish Date - 2022-07-22T13:17:11+05:30

ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమానాలు నిలిచి పోతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్):ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమానాలు నిలిచి పోతున్నాయి.తాజాగా బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం పాట్నా విమానాశ్రయంలో నిలిచిపోయింది.బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన 6ఈ2126 నంబరు గల ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో విమానాన్ని నిలిపివేశారు. ఇండిగో విమాన సర్వీసును రద్దు చేసి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.ఈ ఘటన గురువారం అర్థరాత్రి పాట్నా విమానాశ్రయంలో జరిగింది. విమానంలో బాంబు ఉందని చెప్పడంతో ఆ విమానంలోని  ప్రయాణికులందరినీ కిందకు దించేశారు.విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడు రిషి చంద్ సింగ్‌గా గుర్తించారు. 


ప్రయాణికుడు రిషిచంద్ మానసికంగా సరిగా లేడని విమానాశ్రయ భద్రతా అధికారులు పేర్కొన్నారు.ఇండిగో విమానాన్ని నిలిపివేసి విమానం లోపల సోదాలు నిర్వహించగా ఎలాంటి బాంబు లభించలేదని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.ఇండిగో విమానంలో ఏమీ దొరకలేదు, కానీ ఇప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం శోధన కొనసాగుతోంది.విమానసర్వీసును రద్దు చేశాం, రద్దు చేసిన విమానం శుక్రవారం బయలుదేరుతుంది’’ అని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు.

Updated Date - 2022-07-22T13:17:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising