ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indias Steel Man: జంషెడ్ జె ఇరానీ కన్నుమూత

ABN, First Publish Date - 2022-11-01T10:38:28+05:30

భారతదేశపు ఉక్కు మనిషి(Indias Steel Man), పలు టాటా గ్రూప్ కంపెనీల మాజీ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ(Jamshed J Irani) కన్నుమూశారు.ఈయన వయసు 86 సంవత్సరాలు.

Jamshed J Irani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతదేశపు ఉక్కు మనిషి(Indias Steel Man), పలు టాటా గ్రూప్ కంపెనీల మాజీ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ(Jamshed J Irani) కన్నుమూశారు.ఈయన వయసు 86 సంవత్సరాలు. జంషెడ్ జె ఇరానీ మృతి పట్ల టాటా స్టీల్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.‘‘భారతదేశపు ఉక్కు మనిషి అని ముద్దుగా పిలుచుకునే పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ మరణం పట్ల మేం చాలా బాధపడ్డాం. టాటా స్టీల్ కుటుంబం ఇరానీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది’’ అని టాటా స్టీల్(Tata Steel) ఒక ట్వీట్‌లో(tweet) రాసింది.ఇరానీకి భార్య డైసీ ఇరానీ,అతని ముగ్గురు పిల్లలు జుబిన్, నీలోఫర్, తనాజ్ ఉన్నారు.ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేయడానికి ముందు నాలుగు దశాబ్దాలకు పైగా కంపెనీకి సేవలందించారు.ఇరానీ 1936వ సంవత్సరం జూన్ 2వతేదీన నాగ్‌పూర్‌లో జిజి ఇరానీ, ఖోర్షెడ్ ఇరానీ దంపతులకు జన్మించారు. డాక్టర్ ఇరానీ 1963లో షెఫీల్డ్‌లోని బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్‌లో ఫ్రెషర్‌గా చేరారు. ఆ తర్వాత 1968వ సంవత్సరంలో టాటా స్టీల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా చేరారు.ఇతను 1981లో బోర్డ్ ఆఫ్ టాటా స్టీల్‌లో చేరారు. 2001 నుంచి ఒక దశాబ్దం పాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. టాటా స్టీల్, టాటా సన్స్‌తో పాటు,(Tata Steel and Tata Sons) డాక్టర్ ఇరానీ టాటా మోటార్స్, టాటా టెలిసర్వీసెస్‌తో సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Updated Date - 2022-11-01T10:38:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising