ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియాలో శ్రీలంకలాంటి పరిస్థితే ఉంది: ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్

ABN, First Publish Date - 2022-04-04T22:46:21+05:30

ఇండియాలో శ్రీలంకలాంటి పరిస్థితే ఉంది: ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియాలో ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితిలాగే ఉందని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఎంపీ రాంగోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు దాపురించాయని, ఒక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే 4.27 లక్షల కోట్ల సబ్సిడీలు చెల్లించాల్సి ఉందని.. ఇది కేవలం రెండేళ్లకు సంబంధించిందేనని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


‘‘శ్రీలంక తీవర్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మన దేశ పరిస్థితి కూడా అటుఇటుగా అలాగే ఉంది. కాకపోతే శ్రీలంక బయటికి కనిపిస్తోంది. ఇండియా అంతలా బహిరంగం కాలేదు. నిజానికి ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఒక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే రెండేళ్ల కాలంలో 4.27 లక్షల కోట్ల సబ్సిడీ చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం దివాలా వైపు తీసుకెళ్తోంది’’ అని రాంగోపాల్ యాదవ్ అన్నారు.

Updated Date - 2022-04-04T22:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising