ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian woman In Pakistan : భారతీయ మహిళ 20 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు పాకిస్తాన్‌లో ప్రత్యక్షం..

ABN, First Publish Date - 2022-08-09T03:18:53+05:30

కన్నబిడ్డలకు తనకంటే మంచి జీవితం, కుటుంబ పోషణ లక్ష్యాలు ఆమెను దేశం దాటించాయి. దుబాయ్, రియాద్‌లలో పనిచేసి కొంతకాలం ఇంటికి డబ్బు పంపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ : కన్నబిడ్డలకు తనకంటే మంచి జీవితం, కుటుంబ పోషణ లక్ష్యాలు ఆమెను దేశం దాటించాయి. దుబాయ్, రియాద్‌లలో పనిచేసి కొంతకాలం ఇంటికి డబ్బు పంపింది. కానీ ఓ ఏజెంట్ చేసిన మోసం ఆమె జీవితాన్ని తల్లకిందులు చేసింది. 20 ఏళ్లపాటు కుటుంబానికి దూరంగా పాకిస్తాన్‌లో(Pakistan) జీవితాన్ని వెళ్లదీస్తున్న ముంబైకి చెందిన హమీదా బేగం కన్నీటి కథ వెలుగుచూసింది. సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆధారంగా హమీదా బేగంను అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్(Indian High Commission) అధికారులు తనను ఫోన్ ద్వారా సంప్రదించారని కరాచీ(Karachi)లోని ఓ మసీదు ఇమామ్ వలీవుల్లా మరూఫ్ చెప్పారు. మరూఫ్ పోస్ట్ చేసిన వీడియోను ఓ ఇండియన్ జర్నలిస్ట్ వీక్షించడంతో విషయం అధికారుల వరకు చేరింది. 


కుటుంబాన్ని కలవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నట్టు హమీదా బేగం చెప్పింది. కడుపున పుట్టినవాళ్లను 20 ఏళ్లు చూడకుండా గడిపానని, పిల్లల్ని మనసారా కావలించుకోవాలనిపిస్తోందని ఆమె కన్నీళ్లు చెమర్చింది. కొడుకు, కూతురితో వీడియో కాల్ మాట్లాడినా.. ప్రత్యక్షంగా కలవాలని చాలా కోరికగా ఉందని చెబుతోంది. కాగా అమ్మ ఆచూకీ కోసం చాలాకాలం ప్రయత్నించామని కొడుకు, కూతురు చెప్పారు. తొలినాళ్లలో ఎంతకీ ఫోన్ రాకపోవడంతో ఏజెంట్‌ను సంప్రదించినా ప్రయోజనం దక్కలేదన్నారు. తమతో మాట్లాడడానికి అమ్మ ఇష్టపడడం లేదని ఏజెంట్ తొలుత చెప్పింది. కొన్నాళ్లపాటు ఇదే సమాధానం చెబుతూ వచ్చింది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిందని వెల్లడించారు.


ఇదీ అసలు కథ..

ఖతర్‌లో పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఓ మహిళా ఏజెంట్ చెప్పిన మాటలను హమీదా నమ్మింది. 2002లో రూ.20 వేలు చెల్లించి పయనమైంది. కానీ ఆ ఏజెంట్ ఆమెను మానవ అక్రమరవాణా మార్గంలో పాకిస్తాన్ తీసుకెళ్లి వదిలేసింది. కరాచీలో 3 నెలలపాటు ఒక గదిలో బంధించడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. కరాచీ నుంచి సింధ్‌ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో వదిలేయడంతో పోలీసులకు చిక్కింది. 3 నెలలు జైలుశిక్ష తర్వాత విడుదలయ్యిన ఆమె విధిలేని పరిస్థితుల్లో.. భార్య లేని ఓ పాకిస్తానీని పెళ్లి చేసుకుంది. అతడికి అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. ఆ సవతి కొడుకు వద్దే ప్రస్తుతం ఆమె ఉంది.

Updated Date - 2022-08-09T03:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising