ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర ముంగిట ఇస్రో!

ABN, First Publish Date - 2022-08-07T07:29:56+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్ర సృష్టించేందు కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇస్రో తొలిసారి గా ప్రయోగిస్తున్న స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) అంతరిక్ష యానానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడే చిన్నోడి అంతరిక్షయానం

ప్రయోగానికి సిద్ధంగా ఎస్‌ఎస్‌ఎల్వీ 

ఉదయం 9.18కి  నింగిలోకి 


శ్రీహరికోట(సూళ్లూరుపేట), ఆగస్టు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్ర సృష్టించేందు కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇస్రో తొలిసారి గా ప్రయోగిస్తున్న స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) అంతరిక్ష యానానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 9 గంటళ 18 నిమిషాలకు ఎస్‌ఎ్‌సఎల్వీ రెండు ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలో కి దూసుకెళ్లనుంది. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌)లోని ప్రథ మ ప్రయోగవేదికపై ఎస్‌ఎ్‌సఎల్వీ రెడీగా ఉంది. రాకెట్‌ ను ప్రయోగించేందుకు షార్‌లో శనివారం ఉదయం 11 గంటలకు వాహన సంసిద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్‌) నిర్వహించారు. తిరువనంతపురం వీఎ్‌సఎ్‌ససీ సెంటర్‌ శాస్త్రవేత్త ఈఎస్‌ పద్మకుమార్‌ అధ్యక్షతన సమావేశమైన శాస్త్రవేత్తలు ప్రయోగ రిహార్సల్స్‌లో నమోదైన రాకెట్‌ పనితీరు ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సాయంత్రం షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 7 గంటల పాటు కౌంట్‌డౌన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 9.18 గంటలకు కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఎస్‌ఎ్‌సఎల్వీ.. ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్‌-2ఎతోపాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాదీ శాట్‌తో రోదసిలోకి దూసుకుపోనుంది.


ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రయోగ సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ రాకెట్ల ప్రయోగంలో విజయవంతమైన ఇస్రో.. తొలిసారిగా తక్కువ ఎత్తులోని భూకక్ష్యలో ఉపగ్రహాలు ప్రవేశపెట్టేందుకు ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ను ఎంచుకుంది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించడ మే కాదు... ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఆకర్షించనుంది. ఆ దిశగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కాగా.. ఈ ప్రయోగాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. 

Updated Date - 2022-08-07T07:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising