ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులకు Indian Railways శుభవార్త

ABN, First Publish Date - 2022-04-28T14:14:44+05:30

ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

574 సమ్మర్ స్పెషల్ రైళ్లు

ముంబై:ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త వెల్లడించింది. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే ముంబై, పూణే, షిర్డీల నుంచి దేశంలోని వివిధ గమ్యస్థానాలకు 574 వేసవి స్పెషల్‌ రైళ్లను నడపాలని నిర్ణయించింది.ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా సెంట్రల్ రైల్వే సమ్మర్ స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది.ఈ కొత్త రైళ్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, మన్మాడ్, నాగ్‌పూర్, మాల్దా టౌన్, రేవాల మధ్య 126 వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. దాదర్, మడ్గావ్ ల మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి.లోకమాన్య తిలక్ టెర్మినస్, షాలిమార్, బల్లియా, గోరఖ్‌పూర్, సమస్తిపూర్, థివిమ్ ల మధ్య 282 సమ్మర్ స్పెషల్‌లు నడుస్తాయి.


పన్వెల్, కర్మాలి మధ్య 18 సమ్మర్ స్పెషల్స్ నడుస్తుండగా, నాగ్ పూర్, మడ్గావ్ ల మధ్య 20 సమ్మర్ స్పెషల్స్ అందుబాటులో ఉంటాయి.పూణే, కర్మాలి, జైపూర్, దానాపూర్, విరంగన లక్ష్మీబాయి స్టేషన్, కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ల మధ్య 100 వేసవి స్పెషల్‌లు నడుస్తాయి.సాయినగర్ షిర్డీ, దహర్ కా బాలాజీల మధ్య, సెంట్రల్ రైల్వే 20 వేసవి స్పెషల్‌లను నడపనుంది.లాతూర్,బీదర్ నగరాల మధ్య రెండు సమ్మర్ స్పెషల్స్ అందుబాటులో ఉంటాయి.ఈ అన్ని వేసవి ప్రత్యేక రైళ్ల బుకింగ్‌లు ఇప్పటికే తెరిచారు. 

Updated Date - 2022-04-28T14:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising