ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raksha Bandhan: రక్షాబంధన్ వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్

ABN, First Publish Date - 2022-08-11T18:02:22+05:30

రక్షాబంధన్(Raksha Bandhan) పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా 149 రైళ్ల రద్దు

న్యూఢిల్లీ: రక్షాబంధన్(Raksha Bandhan) పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ(Indian Railways IRCTC cancels trains) ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది.(Indian Railways cancelled 149 trains) రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమబెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. 


రద్దు అయిన రైళ్ల వివరాలు

రాయపూర్-సికింద్రాబాద్,రాజ్ కోట్-సికింద్రాబాద్,హౌరా-సాయినగర్ షిర్డీ,హౌరా-చందన్ పూర్, రాంచీ-పాట్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్-హౌరా, అహ్మదాబాద్-హౌరా, బిలాస్ పూర్ -ఇట్వారీ, పోరుబంధర్-షాలిమార్,రాంచీ-దుంకా, న్యూఢిల్లీ- రోహతఖ్, గోరఖ్ పూర్-గోమతినగర్ వరణాసి-మైసూర్, న్యూ జల్పాయిగురి-అలీపూర్ ద్వార్, టాటానగర్ -ఇట్వారీ, కోర్బా-అమృతసర్, అజ్మీర్-పూరి, బర్ధమాన్-హౌరా రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. పఠాన్ కోట్- జ్వాలాముఖీ రోడ్డు, అసన్ సోల్ మెయిన్- బొకారో స్టీల్ సిటీ, సివాన్ జంక్షన్- గోరఖ్ పూర్, రాంనగర్-మొరాదాబాద్ రైళ్లను రద్దు చేశారు.   


Updated Date - 2022-08-11T18:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising