ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High-speed railway track: బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య హైస్పీడ్ రైలు... ప్రయాణ కాలం రెండున్నర గంటలే...

ABN, First Publish Date - 2022-08-17T01:18:39+05:30

మన దేశంలోని ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రాలైన బెంగళూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మన దేశంలోని ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రాలైన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad) మధ్య ప్రయాణ కాలాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే (Indian Railways) సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు నగరాల మధ్య సెమీ హైస్పీడ్ ట్రాక్‌ను నిర్మించాలని తలపెట్టింది. ఇది అందుబాటులోకి వస్తే రెండున్నర గంటల్లోనే ఒక నగరం నుంచి మరొక నగరానికి చేరుకోవచ్చు. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, బెంగళూరు-హైదరాబాద్ మధ్య సెమీ హైస్పీడ్ ట్రాక్‌ను నిర్మించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనువైన ట్రాక్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం సుమారు 11 గంటలు. దీన్ని రెండున్నర గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  


బెంగళూరులోని యెలహంక స్టేషన్, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ స్టేషన్ మధ్య ఈ ట్రాక్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 503 కిలోమీటర్లు. హైస్పీడ్ రైలు నిరాటంకంగా ప్రయాణించడం కోసం ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తయిన గోడలను నిర్మిస్తారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకంలో భాగంగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.30,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 


Updated Date - 2022-08-17T01:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising