ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

happy independence day : నేవీ అపురూప ఘనత.. 6 ఖండాల్లో తిరంగా జెండా ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-08-16T00:34:33+05:30

భారత (India) స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు(independence day) దేశవ్యాప్తంగా ఆహ్లాదకరంగా జరిగాయి. దేశంలో ఎక్కడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత (India) స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు(independence day) దేశవ్యాప్తంగా ఆహ్లాదకరంగా జరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా మువ్వనెల జెండాల రెపరెపలే కనిపిస్తున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న అమృత మహోత్సవాలు భారత్‌కే పరిమితం కాదని, ఖండాంతరాలలో కూడా వేడుకలు నిర్వహించగలమని ఇండియనే నేవీ చాటిచెప్పింది. 6 ఖండాలు, 3 మహాసముద్రాలు, 6 టైమ్ జోన్లలో తిరంగా జెండాను ఎగురవేసింది. ఇందుకు సంబంధించి వీడియోను ట్వీటర్ వేదికగా పంచుకుంది. అంటార్కిటికా మినహా 6 ఖండాలకు  నౌకలను నేవీ మోహరించినట్టు వెల్లడించింది. ప్రవాస భారతీయులు, ఆతిథ్య దేశం నాయకుల బృందం, ప్రతినిధుల సమక్షంలో జెండాను ఆవిష్కరించినట్టు నేవీ అధికారులు తెలిపారు. దీంతో 6 ఖండాలు, 3 మహాసముద్రాలు, 6 వేర్వేరు టైమ్ జోన్లలో భారత జాతీయ పతకాన్ని ఎగురవేసినట్టయ్యింది. తిరంగా జెండా స్ఫూర్తిని చాటిచెప్పామని ఈ సందర్భంగా ఇండియన్ నేవీ ట్వీట్ చసింది. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేసింది.



Updated Date - 2022-08-16T00:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising