ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 మంది సిబ్బందితో భారత జలాల్లోకి పాక్ బోటు.. గుజరాత్ తీరంలో అదుపులోకి

ABN, First Publish Date - 2022-01-10T02:17:53+05:30

భారత జలాల్లోకి ప్రవేశించిన పదిమంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) అధికారులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: భారత జలాల్లోకి ప్రవేశించిన పదిమంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న పదిమందినీ అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి పొద్దుపోయాక అరేబియా సముద్రంలో ఐసీజీ షిప్ ‘అంకిత్’ గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ‘యాసిన్’ అనే బోటును అదుపులోకి తీసుకున్నామని, అందులో పదిమంది పాక్ జాతీయులు ఉన్నారని ఐసీజీ అధికారులు తెలిపారు.


భారత జలాల్లో 6-7 ఏళ్ల మైళ్ల దూరంలో ఇది ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఐసీజీ షిప్‌ను చూడగానే తప్పించుకునేందుకు పాక్ బోటు ప్రయత్నించినప్పటికీ అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. బోటు నుంచి 2 టన్నుల చేపలు, 600 లీటర్ల ఇంధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వీరిని పోర్‌బందర్‌కు తరలించారు. 

Updated Date - 2022-01-10T02:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising