ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ పౌరులకి కీలక సూచనలు చేసిన కీవ్ రాయబార కార్యాలయం

ABN, First Publish Date - 2022-02-26T15:28:40+05:30

ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకి కీవ్‌లోని రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకి కీవ్‌లోని రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించారు. వివిధ సరిహద్దు చెక్‌పాయింట్‌ల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. భారత పౌరులను తరలించడం కోసం పొరుగు దేశాలలోని మా ఎంబసీలతో రాయబార కార్యాలయాలతో నిరంతరం పని చేస్తున్నామన్నారు. ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దు చెక్‌పాయింట్‌లకు చేరుకునే భారతీయ పౌరులకు సహాయం చేయడం ఎంబసీకి కష్టతరంగా మారింది. ఉక్రెయిన్‌లోని పశ్చిమ నగరాల్లో నీరు, ఆహారం, వసతి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట ఉండటం సురక్షితమైనది. పరిస్థితిని పూర్తిగా తెలుసుకోకుండా సరిహద్దు చెక్ పాయింట్‌లకు రాకండి. ప్రస్తుతం తూర్పు సెక్టార్‌లో ఉన్న వారందరూ తదుపరి సూచనల వరకు వారి ప్రస్తుత నివాస స్థలాల్లోనే ఉండాలి. వీలైనంత వరకూ ఇంట్లో లేదా షెల్టర్‌లలో ఉండాలని, ఆహారం, నీరు మరియు సౌకర్యాలు అందుబాటులో ఉంచుకుని ఓపికగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకండి. ఎప్పటికప్పుడు తమ పరిసరాల్లో ఉన్న పరిణామాల గురించి తెలుసుకోవాలని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు సూచించింది. 

Updated Date - 2022-02-26T15:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising