ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arunachal Pradesh: కూలిన సైనిక హెలికాప్టర్... పైలట్ మృతి...

ABN, First Publish Date - 2022-10-05T19:10:25+05:30

భారత సైన్యం (Indian Army)కి చెందిన చీతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత సైన్యం (Indian Army)కి చెందిన చీతా (Cheetah) హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్‌లో బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందినట్లు, మరొక పైలట్‌కు చికిత్స జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్ రోజువారీ గస్తీ తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. 


బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స జరుగుతుండగా ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 


భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓ హెలికాప్టర్ కూలిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్  తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపింది. గాయపడిన రెండో పైలట్‌కు చికిత్స జరుగుతోందని పేర్కొంది. ఈ ప్రమాదానికి కారణాలు ఈ దశలో తెలియదని పేర్కొంది. 


ఇదిలావుండగా, 2021 డిసెంబరులో అప్పటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా నీలగిరి జిల్లాలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. 


Updated Date - 2022-10-05T19:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising