ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీలో చేరిన దేశంలోనే అతిపొడగరి

ABN, First Publish Date - 2022-01-23T16:19:16+05:30

దేశంలోనే అతిపొడగరిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ యూపీ రాజకీయాల్లోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశంలోనే అతిపొడగరిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ యూపీ రాజకీయాల్లోకి వచ్చారు. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు. ప్రపంచ రికార్డుకు కేవలం 11 సెంటీమీటర్లు తక్కువ.


సమాజ్‌వాదీ పార్టీలో ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాకను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ స్వాగతించారు. ఎన్నికల ముందు ఆయన పార్టీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ విధానాలు, అఖిలేష్ యాదవ్ నాయకత్వం నచ్చి ఆయన పార్టీలో చేరినట్టు చెప్పారు. కాగా, తన ఎత్తే తనకు సెలబ్రెటీ హోదా, పేరు తెచ్చిందని ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. యూపీ ఎన్నికలను ఈసారి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా, అఖిలేష్ యాదవ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఎన్నికల బరిలోకి దిగారు.

Updated Date - 2022-01-23T16:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising