ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో మళ్లీ కరోనా కలకలం...24 గంటల్లో 45 శాతం కేసుల పెరుగుదల

ABN, First Publish Date - 2022-06-27T17:52:19+05:30

దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గడచిన 24 గంటల్లోనే 17,073 కొవిడ్ కేసులు నమోదవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దేశంలో గడచిన 24 గంటల్లోనే కొవిడ్ కేసులు 45 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. ఆదివారం ఒక్కరోజే 11,739 కేసులు నమోదయ్యాయి.21 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 5,25,020 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 94,420 కేసులకు పెరిగింది. గత 24 గంటల్లో 15,208 మంది రోగులు కోలుకున్నారు. దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 5.62 శాతానికి పెరిగింది.


 దేశంలో వారంవారీ కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.39 శాతంగా ఉంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు కొవిడ్ బూస్టర్ డోసు వ్యాక్సిన్ల కోసం బారులు తీరుతున్నారు. సోమవారం ఉదయం నాటికి దేశంలో కొవిడ్-19 టీకా కవరేజీ 197.11 కోట్లను అధిగమించింది. ముంబయి నగరంలో కొవిడ్ కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో ముంబయి నగరంలో ఐదుగురు మరణించారు.ఢిల్లీలో కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Updated Date - 2022-06-27T17:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising