ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే రోజులో 3,116 కోవిడ్ కేసులు, 47 మరణాలు

ABN, First Publish Date - 2022-03-13T15:43:03+05:30

దేశంలో గత 24 గంటల్లో 3,116 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 47 మంది మృత్యువాత ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 3,116 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 47 మంది మృత్యువాత పడ్డారు. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 5,559 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 38,069కి తగ్గింది. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,15,850కి చేరగా, తొలి కేసు 2020లో నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమాచారం ప్రకారం, దేశంలో మార్చి 12వ తేదీ వరకూ 77,85,20,151 శాంపుల్స్ పరీక్షించగా, శనివారంనాడు 7,61,713 శాంపుల్స్ పరీక్షించారు. కాగా, ఢిల్లీలో శనివారంనాడు కొత్తగా 161 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.44గా ఉంది. మార్చి 5,6,7 తేదీల్లో సిటీలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. జనవరి 13న కరోనా కేసుల సంఖ్య 28,867 కేసులకు చేరుకోగా, ఆ తర్వాత నుంచి రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.

Updated Date - 2022-03-13T15:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising