ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను మార్చుకున్న India, Pakistan

ABN, First Publish Date - 2022-07-01T21:43:55+05:30

తమతమ కస్టడీల్లో ఉన్న పౌర ఖైదీలు, ప్రాదేశిక సముద్ర జలాల్లో పట్టుబడ్డ మత్స్యకారుల జాబితాలను భారత్ (India

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్ : తమతమ కస్టడీల్లో ఉన్న పౌర ఖైదీలు, ప్రాదేశిక సముద్ర జలాల్లో పట్టుబడ్డ జాలర్ల జాబితాలను భారత్ (India), పాకిస్తాన్(Pakistan) పరస్పరం మార్చుకున్నాయి. భారతీయ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 309 మంది పాకిస్తానీ పౌర ఖైదీలు, 95 మంది మత్స్యకారుల లిస్ట్‌ను పాక్‌కు భారత విదేశాంగ శాఖ(external affairs ministry) అధికారులు అందించారు. 49 మంది భారతీయ ఖైదీలు, 633 మంది మత్స్యకారుల జాబితాను భారత్‌కు దాయాది దేశం అప్పగించింది. దౌత్య విధానాల (diplomatic channels) ద్వారా ఇరుదేశాలూ జాబితాలను షేర్ చేసుకున్నాయి. శిక్షాకాలం పూర్తి చేసుకున్న 536 మంది మత్స్యకారులు, ముగ్గురు పౌరులను సత్వరమే అప్పగించాలని ఈ సందర్భంగా భారత్ విజ్ఞప్తి చేసింది. పౌర ఖైదీలు, అదృశ్యమైన భారత రక్షణరంగ అధికారులు, మత్స్యకారులను ముందస్తుగా విడుదల చేయాలని పాక్‌కు అధికారులు విన్నవించారు. భారతీయులుగా నిర్ధారించినవారి జాబితాను కూడా పాక్‌కు అందించామని విదేశాంగ వ్యవహారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దౌత్యమార్గాల ద్వారా తమవారిని విడుదల చేయాలని సూచించినట్టు వివరించింది. 


కాగా మే 2008లో కుదిరిన ‘కాన్సులార్ యాక్సెస్ అగ్రిమెంట్’(Agreement on Consular Access) ప్రకారం జనవరి 1, జులై 1 తేదీల్లో ఖైదీల డేటాను పరస్పరం అందించుకోవడం దాయాది దేశాల మధ్య కొనసాగుతోంది. వేగంగా వ్యక్తుల పౌరసత్వం గుర్తింపు, ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం ఉపయోగపడుతోంది. ఖైదీలలో అధికులు మత్స్యకారులే ఉంటున్నారు. ఇటివల ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు సన్నగిల్లినా ఖైదీల అప్పగింత మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది.

Updated Date - 2022-07-01T21:43:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising