ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2027లో అందుబాటులోకి బుల్లెట్ ట్రైన్

ABN, First Publish Date - 2022-04-13T21:10:17+05:30

దేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మొదలైన సంగతి తెలిసిందే. మొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రాబోతుంది. కటింగ్ హెడ్జ్ టెక్నాలజీ ద్వారా రానున్న ఈ బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మొదలైన సంగతి తెలిసిందే. మొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రాబోతుంది. కటింగ్ హెడ్జ్ టెక్నాలజీ ద్వారా రానున్న ఈ బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ సంస్థ ఎండీ సతీష్ అగ్నిహోత్రి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం కటింగ్ హెడ్జ్ టెక్నాలజీ వాడుతున్నారు. దీని ద్వారా ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుంది. ప్రపంచంలో నాలుగైదు దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 11,000 గ్రైడర్లు (భారీ ఇనుప కడ్డీలు) అమర్చాల్సి ఉంటుంది. 


ఒక్కో గ్రైడర్ అమర్చేందుకు దాదాపు వారం రోజుల సమయం పడుతుంది. దీన్నిబట్టి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రైడర్స్ వేగంగా అమర్చేందుకు 15 ప్రత్యేక యార్డ్స్ ఏర్పాటు చేశారు. ఇండియాతోపాటు జపాన్‌కు చెందిన నిపుణులు కూడా దీనిపై వర్క్ చేస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం 2027 నాటికి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. బుల్లెట్ ట్రైన్ మార్గం కోసం గుజరాత్, మహారాష్ట్రలో భూ సేకరణ జరగాల్సి ఉంది. దీని ప్రకారం గుజరాత్‌లో కావాల్సిన భూమిలో దాదాపు 99 శాతం భూ సేకరణ జరగగా, మహారాష్ట్రలో మాత్రం 68 శాతం మాత్రమే భూసేకరణ జరిగింది.

Updated Date - 2022-04-13T21:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising