ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్

ABN, First Publish Date - 2022-06-09T01:55:08+05:30

పర్యావరణ పనితీరు సూచీ (EPI)లో 180 దేశాల్లో భారత దేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పర్యావరణ పనితీరు సూచీ (EPI)లో 180 దేశాల్లో భారత దేశం అట్టడుగున ఉంది. యేల్, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించిన అద్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వాతావరణ మార్పులు, పర్యావరణ ప్రజారోగ్యం, జీవ వైవిద్ధ్యం వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. 


ఈ పరిశోధకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో భారత దేశానికి వచ్చిన స్కోరు 18.9. కాగా డెన్మార్క్‌ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమెరికా 43వ స్థానంలో ఉంది. నైజీరియా కూడా అట్టడుగున కనిపిస్తోంది. పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిద్ధ్యం, ఆవాసయోగ్యత, ఎకోసిస్టమ్ సర్వీసెస్, గడ్డి భూముల క్షీణత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు. దురదృష్టవశాత్తూ భారత దేశం ఈ అన్ని అంశాల్లోనూ అట్టడుగునే ఉంది. ప్రాంతీయంగా చూసినా, అంతర్జాతీయంగా చూసినా దిగువ స్థానంలోనే ఉంది. 


2050నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు ఉండకూడదు) అనే లక్ష్యం దిశగా డెన్మార్క్, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రయాణిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. దీనికి విరుద్ధంగా రష్యా, భారత్, చైనా వెళ్తున్నాయని తెలిపింది. 


Updated Date - 2022-06-09T01:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising