ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం

ABN, First Publish Date - 2022-01-13T22:11:33+05:30

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను  ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రిపోర్టులోని అంశాలను ఆయన వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర పెరిగిన అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉందని ఆయన తెలిపారు. అటవీ విస్తీర్ణంలో ఏపీలో గరిష్టంగా 647 చ.కి.మీ మేర పెరుగుదల నమోదయిందని ఆయన పేర్కొన్నారు.  తర్వాతి స్థానాల్లో తెలంగాణలో 632 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల నమోదయిందన్నారు. ఒడిశాలో 537 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం  పెరిగిందని మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. 


Updated Date - 2022-01-13T22:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising