ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుని కోసం ఈ నరమేధాన్ని ఆపండి : పోప్ ఫ్రాన్సిస్

ABN, First Publish Date - 2022-03-14T00:43:47+05:30

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాటికన్ సిటీ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. చిన్న పిల్లల ఆసుపత్రులు, సామాన్య ప్రజలపై బాంబులు కురిపించడం ఆటవిక, పైశాచిక చర్య అని తెలిపారు. ఆమోదయోగ్యం కానటువంటి ఈ నరమేధాన్ని దేవుని కోసం  ఆపాలని కోరారు. వీక్లీ ప్రేయర్స్ సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. 


చర్చలపై నిజమైన, నిర్ణయాత్మకమైన దృష్టి పెట్టాలని కోరారు. మానవతావాద నడవ (కారిడార్)లను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని కోరారు. బాలలను, నిరాయుధులను చంపడం ఆటవిక చర్య అని పేర్కొన్నారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సండే బ్లెస్సింగ్ సందర్భంగా వేలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోతున్నారు. ఆ దేశంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లివివ్‌లోని ఉక్రెయినియన్ మిలిటరీ బేస్‌పై రష్యా దాడిలో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు, సుమారు 134 మంది గాయపడ్డారు. ఈ సైనిక స్థావరం 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిపై దాదాపు 30 రాకెట్లను రష్యా దళాలు ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటిలో కొన్నిటిని మధ్యలోనే ఉక్రెయిన్ దళాలు అడ్డుకోగలిగినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో వందలాది మంది సామాన్య ప్రజలు, అదేవిధంగా రష్యన్ సైనికులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-03-14T00:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising