ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆజాద్‌కు మద్దతుగా మరో 20 మంది కాంగ్రెస్ నేతల రాజీనామా

ABN, First Publish Date - 2022-09-03T00:40:57+05:30

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి గుడ్‌బై చెప్పిన గులాం నబీ ఆజాద్‌కు మద్దతు జమ్మూ నార్త్‌ జిల్లా కాంగ్రెస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి గుడ్‌బై చెప్పిన గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad)కు మద్దతు జమ్మూ నార్త్‌ జిల్లా కాంగ్రెస్ కమిటీకి చెందిన 20 మందికి పైగా నేతలు కాంగ్రెస్ పార్టీకి శుక్రవారంనాడు రాజీనామా చేశారు.  కాంగ్రెస్‌కు ఆజాద్ ఉద్వాసన చెప్పిన ఆజాద్ తొలి ర్యాలీని సెప్టెంబర్ 4న జమ్మూలో  నిర్వహించనున్నారు. అదే రోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం దేశ రాజధాని ఢిల్లీలో ధరల పెరుగుదలకు నిరసనగా 'మెహంగాయ్ పర్ హల్లా బోల్' (Mehngi par Halla Bol) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


మరోవైపు, సొంత పార్టీ ఏర్పాటుకు ఆజాద్ సన్నద్ధమవుతున్నారు. రాబోయే పక్షం రోజుల్లో పార్టీ ఫస్ట్ యూనిట్‌ను జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన సన్నిహితుడు జిఎం సరూరి ధ్రువీకరించారు. ఆజాద్ ర్యాలీకి ముందే జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతల రాజీనామా పర్వం కొద్దిరోజులుగా కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌ సహా  63 మంది నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆజాద్‌కు మద్దతుగా ఆయన క్యాంప్‌లో గత మంగళవారం చేరిపోయారు. వందలాది మంది కాంగ్రెస్ నేతలు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులు, ప్రముఖ కార్యకర్తలు సైతం రాజీనామాలు చేసి ఆజాద్‌కు మద్దతు ప్రకటించినట్టు సరూరి తెలిపారు.

Updated Date - 2022-09-03T00:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising