ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sena vs Sena Battle : రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై సత్వర విచారణ చేపట్టబోం.. సుప్రీంకోర్ట్ స్పష్టీకరణ

ABN, First Publish Date - 2022-07-11T18:47:35+05:30

మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభంలో రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం(Maharastra Political Crisis)లో రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. కోర్ట్ విచారణ ముగిసే వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదని, ఈ మేరకు తమకు సమాచారం ఇవ్వాలని సీజేఐ(CJI) ఎన్‌వీ రమణ(NV Ramana) నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ వేర్వేరు పిటిషన్లతో ముడిపడివున్నందున రాజ్యాంగబద్ధ బెంచ్ ఏర్పాటు అవసరమని, ఈ పిటిషన్ల లిస్టింగ్‌కు కొంత సమయం అవసరమని తెలిపింది. అయితే ఎప్పటిలోగా బెంచ్ ఏర్పాటు చేసే విషయాన్ని సుప్రీంకోర్ట్ పేర్కొనలేదు. వాస్తవానికి సోమవారం(ఈ రోజు) విచారణ జరగాల్సిన నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. పిటిషన్లు అన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేస్తామన్న సీజేఐ ఎన్‌వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది.


సత్వర విచారణ చేపట్టాలని ఉద్ధవ్ థాక్రే(Uddav Thackerey) సారధ్యంలోని శివసేన(Shivasena) తరపున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ కోర్ట్‌ని అభ్యర్థించారు. నాలుగు జ్యూడిషీయల్ ఆర్డర్లు ఉన్నా ఇంకా లిస్టింగ్‌కు రాకపోవడం ఏమిటని వాదించారు. కాగా సుప్రీం నిర్ణయంతో ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సారధ్యంలోని రెబల్ ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించినట్టయ్యింది.


కాగా 15 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటిసులపై సుప్రీంకోర్ట్‌(Supreme Court)లో విచారణ జరగాల్సి ఉంది. వీటితోపాటు ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయడంపై, కొత్త ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్(Governer) భగత్ సింగ్ కోశ్యారీ(Bhagath Singh koshyary) ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాక్రే సారధ్యంలోని శివసేన వర్గం వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. కాగా సంక్షోభ సమయంలో అసెంబ్లీ స్పీకర్ లేకపోవడంతో నాటి ఉప స్పీకర్ నర్హరి జిర్వాల్ అనర్హత నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ ఏక్‌నాథ్ షిండే సారధ్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్ట్‌ని ఆశ్రయించారు. కోర్టులో తేలే వరకు అనర్హతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని సుప్రీంకోర్ట్ ఆదేశించడం, ఆ తర్వాత పరిణామాలు తెలిసినవే.

Updated Date - 2022-07-11T18:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising