ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ganesh Chaturthi festival:కర్ణాటక హైకోర్టు అర్దరాత్రి సంచలన ఉత్తర్వులు

ABN, First Publish Date - 2022-08-31T12:55:55+05:30

కర్ణాటక రాష్ట్రంలో హుబ్బళ్లి ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలకు(Ganesh Chaturthi festival) కర్ణాటక హైకోర్టు మంగళవారం అర్ధరాత్రి(late night hearing)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి

హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో హుబ్బళ్లి ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలకు(Ganesh Chaturthi festival) కర్ణాటక హైకోర్టు మంగళవారం అర్ధరాత్రి(late night hearing) అనుమతినిచ్చింది.(Karnataka HC ALLOWS) కర్ణాటకలోని  హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రణాళికాబద్ధంగా జరపాలని సూచించింది. బెంగళూరు ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించవద్దని ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత, హుబ్బళ్లి ఈద్గాపై(Hubballi Idgah) దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు(Karnataka High Court) తిరస్కరించింది. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మునిసిపాలిటీకి చెందినదని, అంజుమన్-ఏ-ఇస్లాం సంవత్సరానికి 1 రూపాయి రుసుముతో 999 సంవత్సరాల కాలానికి లీజుదారుగా మాత్రమే ఉందని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అశోక్ ఎస్ కినాగి పేర్కొన్నారు.


అంతకుముందు రోజు ఈ అంశాన్ని కోర్టు విచారించింది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను అంజుమన్-ఏ-ఇస్లాం కోర్టులో సవాలు చేసింది. కమీషనర్ ఆదేశాలను కోర్టు అనుమతించింది. అయితే అదే సమయంలో బెంగళూరులోని చామ్‌రాజ్‌పేట ఈద్గా మైదాన్‌లో వినాయక చవితి ఉత్సవాలను అనుమతించ వద్దని సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది.బెంగుళూరు చామ్‌రాజ్‌పేట మైదానంలో యథాతథ స్థితికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తించదని హైకోర్టు పేర్కొంది.చామ్‌రాజ్‌పేట అంశంలో ఆస్తి యాజమాన్యం వివాదం ఉందని, అయితే హుబ్బళ్లి మైదానం మున్సిపాలిటీకి చెందినదని, దీనిని అంజుమన్-ఎ-ఇస్లాం(Anjuman-e-Islam) కూడా అంగీకరించిందని కోర్టు ఎత్తిచూపింది.



బెంగళూరు ఈద్గా అంశంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాల్సిన గణేష్ చతుర్థి పండుగను నిలిపివేయాల్సి వచ్చింది.హుబ్బళ్లి కేసులో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జస్టిస్ కినాగి రాత్రి 10 గంటలకు తన అధికారిక ఛాంబర్‌లో ఈ అంశాన్ని విచారించారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సహా వివిధ పక్షాల వాదనలు విన్న తర్వాత రాత్రి 11.15 గంటలకు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2022-08-31T12:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising