ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లాదేశ్‌లో హిందువులపై 9 ఏళ్లలో 3600 దాడులు

ABN, First Publish Date - 2022-03-19T02:54:27+05:30

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై గడచిన 9 సంవత్సరాలలో 3600 దాడులు జరిగాయి. 1990 నుంచి మైనార్టీలైన హిందువులపై దాడులు జరగడం మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై గడచిన 9 సంవత్సరాలలో 3600 దాడులు జరిగాయి. 1990 నుంచి మైనార్టీలైన హిందువులపై దాడులు జరగడం మొదలైంది. 1990, 1995, 1999, 2002లో పెద్ద స్థాయిలో దాడులు జరిగాయి. 2021లో నవరాత్రుల వేళ మండపాలపై దాడులు జరిపారు. విధ్వసం సృష్టించారు. ఉగ్రవాదులకు ఊతమిచ్చే అన్సరుల్లా బంగ్లా, హాజ్బ్ ఉత్ తహరీర్, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ గ్రూపుల ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆందోళన కలిగించే మరో అంశం కూడా ఉంది. 1974లో 13.3%గా ఉన్న హిందువుల జనాభా 1981లో 12.1%కి తగ్గింది. 1991లో 10.5%కి, 2001లో 9.3%కి, 2011 8.5%కి, 2021లో 6.5 శాతానికి తగ్గిపోయింది. 


నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఢాకాలోని రాధాకాంత జీవ్ ఇస్కాన్ మందిరంపై హాజీ సైఫుల్లా ఆధ్వర్యంలో 200 మంది సాయుధులు దాడులకు పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఇద్దరు భక్తులను కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించారు. మందిరంలో ఉన్న మరికొందరిని గాయపరిచారు. ఆలయంలో ఉన్న విగ్రహాలను, విలువైన వస్తువులను, ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ వివరాలను ఇస్కాన్ ప్రతినిధి ఆమని కృష్ణదాస్ వెల్లడించారు. అయితే స్థానిక పోలీసుల సాయంతో తమ భక్తులైన సుమంత్రా చంద్ర శ్రవణ్‌ను, నిహార్ హల్దార్‌ను, రాజీవ్ భద్రమ్‌ను కాపాడుకోగలిగామన్నారు. ప్రస్తుతానికి భారత హైకమిషన్ బంగ్లాదేశ్ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతోంది. 

Updated Date - 2022-03-19T02:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising