ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోరెగావ్‌ కేసులో అభియోగాలను 3 నెలల్లో సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2022-08-19T06:03:59+05:30

భీమా-కోరెగావ్‌ కేసుకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా ఈ కేసుపై అభియోగాలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 


న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భీమా-కోరెగావ్‌ కేసుకు సంబంధించి  గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా ఈ కేసుపై అభియోగాలను సిద్ధం చేయాలని ఎన్‌.ఐ.ఏ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. అదేవిధంగా నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై  నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ రవీందర్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో నిందితుడైన వెర్నాన్‌ గాన్‌స్లేవ్స్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారిస్తున్న సందర్బంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.


భీమా కోరెగావ్‌ కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఇతర నిందితులతో సంబంధం లేకుండా వెర్నాన్‌ గాన్‌స్లేవ్స్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని పేర్కొంది.  2019లో బాంబే హైకోర్టు తన బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించడంతో వెర్నాన్‌ గాన్‌స్లేవ్స్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇదే కేసులో సుధా భరద్వాజ్‌, వరవరరావు, గౌతమ్‌ నవలఖా, సురేంద్ర గాడ్లింగ్‌, రోనా విల్సన్‌ తో పాటు 16 మంది మేధావులు, రచయితలను నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-19T06:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising