ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఐఎండీ Yellow alert జారీ

ABN, First Publish Date - 2022-05-30T17:22:50+05:30

భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభమైంది.రుతుపవనాలు సాధారణ తేదీ జూన్ 1 కంటే మూడు రోజుల ముందుగానే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.ఢిల్లీలో సోమవారం ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సోమవారం ఢిల్లీ నగరంలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి తెలిపారు.కేరళ, కర్ణాటక, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి.మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు. 


కేరళలో శనివారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని వివిధ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షం, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, బాగేశ్వర్, పితోర్‌గఢ్ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.జమ్మూ కాశ్మీర్‌లో వచ్చే 24 గంటల్లో పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం,ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. 


Updated Date - 2022-05-30T17:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising