ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IMD orange alert : పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీవర్షాలు

ABN, First Publish Date - 2022-09-13T15:13:18+05:30

క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:క్యుములోనింబస్ క్లౌడ్( Cumulonimbus cloud formation) ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ (weather department) మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీవర్షాలు((Heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ (India Meterological Department) తెలిపింది. ముంబయి(Mumbai) నగరంతోపాటు పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున(warned of heavy rainfall) లోతట్టుప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీపేర్కొంది. 


ముంబయి నగరంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ (yellow alert)జారీ చేసింది.సెప్టెంబరు 14 నుంచి 16వతేదీ వరకు మూడు రోజుల పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని (Maharashtra) పూణే, అహ్మద్ నగర్ ప్రాంతాల్లో వచ్చే నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పూణే నగర ఐఎండీ విభాగం అధికారి డాక్టర్ అనుపం కశ్యప్ చెప్పారు. డెహ్రాడూన్, చంపావత్, పిటోరాఘడ్, బాగేశ్వర్, నైనిటాల్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరంజ్ అలర్ట్(IMD orange alert) ప్రకటించారు.


 దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే అయిదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోల్ కతా, హౌరా, పశ్చిమ మిడ్నాపూర్, బిర్ భూమ్, ముర్షిదాబాద్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. రాజస్థాన్ రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, కొంకణ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. 


Updated Date - 2022-09-13T15:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising