IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN, First Publish Date - 2022-12-16T08:14:57+05:30
అండమాన్‌కు నైరుతి దిశగా ఉత్తర సుమత్రా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి అల్పపీ
- అరేబియాలో మరొకటి
- 19వ వరకు వర్షాలు
- వాతావరణ శాఖ వెల్లడి
చెన్నై, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అండమాన్‌కు నైరుతి దిశగా ఉత్తర సుమత్రా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావం కారణంగా ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం తీవ్రంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి అరేబియా సముద్రంలో పశ్చిమ, వాయువ్య దిశగా గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా అండమాన్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖాధికారులు సూచించారు. అదేసమయంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడుపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. అయితే తిరువణ్ణామలై, వేలూరు, విల్లుపురం, సేలం, తేని(Thiruvannamalai, Vellore, Villupuram, Salem, Theni) జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు 29న ప్రవేశించాయి. ఈ రుతుపవనాల ప్రారంభ సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారింది. దీనికి మాండస్ అనే పేరు పేట్టారు. అది తీవ్రరూపం దాల్చి చెన్నై సమీపంలోని మహాబలిపురంలో తీరం దాటింది. ఈ తుఫాన్ కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు డెల్టా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసి అపారనష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. ఈ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచివుందని వాతావారణ శాఖ హెచ్చరించింది.
Updated Date - 2022-12-16T08:17:20+05:30 IST