ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సిల్లీ సోల్స్‌’ స్మృతి కుటుంబానిదే

ABN, First Publish Date - 2022-08-04T10:38:44+05:30

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు గోవాలో అక్రమంగా బార్‌ నడుపుతున్నారన్న విషయమై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జీఎస్టీ నంబరు, అడ్రస్‌ ఆమె భర్త కంపెనీదే 
  • గోవా కాంగ్రెస్‌ నాయకుడు గిరీశ్‌ ఆరోపణ  

పణజీ, ఆగస్టు3: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు గోవాలో అక్రమంగా బార్‌ నడుపుతున్నారన్న విషయమై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. గోవా కాంగ్రెస్‌ నాయకుడు గిరీష్‌ చోడాంకర్‌ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆ బార్‌ స్మృతి కుటుంబ సభ్యులదే అనడానికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సిల్లీ సోల్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను స్మృతి కుమార్తె జోయిష్‌ ఇరానీ (18) అక్రమంగా నడుపుతున్నట్టు ఆరోపించారు. ఆ బార్‌-- హౌస్‌ నెంబరు 452, బౌటా వడ్డో, అస్సాగావ్‌ విలేజ్‌ అనే చిరునామాలో ఉందని తెలిపారు. అదే చిరునామాలో స్మృతి భర్త జుబిన్‌ ఇరానీ, ఇతర కుటుంబ సభ్యులు నడుపుతున్న ఎయిటాల్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ చిరునామా కూడా ఉందని చెప్పారు. ఈ కంపెనీకి ఉన్న జీఎస్టీ నెంబరు, సిల్లీ సోల్స్‌కు ఉన్న జీఎస్టీ నెంబరు ఒక్కటేనని తెలిపారు. ప్రముఖ ఫుడ్‌ క్రిటిక్‌ కునాల్‌ విజయ్‌కర్‌కు ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలో ఈ బార్‌ తనదేనంటూ జోయిష్‌ ఇరానీ అంగీకరించారని గిరీష్‌ చోడాంకర్‌ గుర్తు చేశారు. ఈ వాస్తవాల నేపథ్యంలో స్మృతిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలను గోవా బీజేపీ అధికార ప్రతినిధి ఉర్ఫాన్‌ ముల్లా ఖండించారు. ఈ విషయమై మాట్లాడేందుకు చోడాంకర్‌కు ఎలాంటి అధికారం లేదని అన్నారు. 

Updated Date - 2022-08-04T10:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising