ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ilayarajaకు అభినందనల వెల్లువ

ABN, First Publish Date - 2022-07-08T13:47:07+05:30

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయిన ఇసైజ్ఞాని ఇళయరాజాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని సినీరంగంతో పాటు వివిధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), జూలై 7: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయిన ఇసైజ్ఞాని ఇళయరాజాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని సినీరంగంతో పాటు వివిధ రంగాకు చెందిన ప్రముఖులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే ఇళయరాజాకు రజనీ, కమల్‌ వంటి హేమాహేమీలు శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా ఆయనకు, మాజీ అథ్లెట్‌ పీటీ ఉషకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తన సంగీతంతో రాష్ట్రాలకు అతీతంగా ప్రతి ఒక్కరి మనస్సులను గెలుచుకున్న ‘ఇసైజ్ఞాని ఇళయరాజా రాజ్యసభ సభ్యుడుగా ఉన్నతమైన సేవలు అందించాలని అభినందిస్తున్నాను. అలాగే, రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయిన పీటీ ఉషకు కూడా నా అభినందనలు. పార్లమెంట్‌లో ఆమె భాగస్వామ్యం దేశ క్రీడా రంగంలో మౌలికసదుపాయాల రూపకల్పనకు దోహదపడేలా, ప్రోత్సహించేలా ఉంటుందని భావిస్తున్నాను’’ అని స్టాలిన్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా తనకు అభినందనలు తెలిపిన సీఎం స్టాలిన్‌కు ఇళయరాజా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. ‘నన్ను అభినందించిన సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు. నాపై అపారమైన ప్రేమాభిమానాలు చూపించే అభిమానులు కూడా భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన గౌరవానికి అభినందనలు తెలుపుతున్నారు. వీరికి ఒక్కొక్కరిగా ధన్యవాదాలు చెప్పడం వీలుపడదు కాబట్టి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ఇళయరాజా పేర్కొన్నారు. అదేవిధంగా ఇళయరాజాకు సీనియర్‌ దర్శకనిర్మాత గుహనాథన్‌, హీరో విశాల్‌ తదితరులు కూడా అభినందనలు తెలిపారు. 

Updated Date - 2022-07-08T13:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising