ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని అంశాల్ని కోర్టే చూస్తే పార్లమెంట్‌ ఎందుకు? సీజేఐ

ABN, First Publish Date - 2022-04-08T01:28:37+05:30

రోహింగ్యాలకు వ్యతిరేకంగా అప్పట్లో ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా సెప్టెంబర్ 2017లో ఇద్దరు రోహింగ్యాలు సుప్రీంను ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ అంశంపై వరుస పిటిషన్లు సుప్రీం తలుపు తడుతూనే ఉన్నాయి. ఒకానొక పిటిషన్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలతో సుప్రీంకోర్టుపై మరింత భారం పడుతోందని, రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా కోర్టు తలుపు తడుతున్నాయని, అన్ని సమస్యలు కోర్టు దృష్టికే వస్తే ప్రజలు ఎన్నికున్న ప్రజాప్రతినిధులు ఎందుకని.. లోక్‌సభ, రాజ్యసభ్య అర్థమేంటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. అక్రమ వలసదారులందరినీ ఏడాదిలోగా గుర్తించి, నిర్బంధించి, బహిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌కి సీజీఐ ఈ ప్రశ్నను వేశారు.


రోహింగ్యాలకు వ్యతిరేకంగా అప్పట్లో ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా సెప్టెంబర్ 2017లో ఇద్దరు రోహింగ్యాలు సుప్రీంను ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ అంశంపై వరుస పిటిషన్లు సుప్రీం తలుపు తడుతూనే ఉన్నాయి. ఒకానొక పిటిషన్‌లో ‘‘ఐదు కోట్ల మంది అక్రమ వలసదారులు మా జీవనోపాధి హక్కును హరిస్తున్నారు’’ అని దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీం ధర్మాసనాన్ని ఉపాధ్యాయ్ కోరారు. ఇక తాజా పిటిషన్‌పై గురువారం సీజేఐ స్పందిస్తూ ‘‘ప్రతిరోజూ నేను మీ (ఉపాధ్యాయ్) కేసును మాత్రమే వినాలా? పార్లమెంటు సభ్యుల సమస్య, నామినేషన్ సమస్య, ఎన్నికల సంస్కరణలు, వీటితో పాటు అనేక సమస్యలు సుప్రీం విచారణకు వస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వం చేత పరిష్కరించబడాలి. కానీ సున్నితమై రాజకీయ సమస్యలు కూడా కోర్టులో దాఖలు అవుతున్నాయి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-08T01:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising