ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌లో మెజారిటీ తగ్గితే వెళ్లిపోతా: శ్రీలంక ప్రధాని

ABN, First Publish Date - 2022-04-27T22:13:25+05:30

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి నిరసనలు చేయడం లేదు. ప్రత్యేక వర్గాలకు చెందిన కొంత మంది మాత్రమే ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశంలోని ఆర్థిక పరిస్థితిని మెగురుపర్చడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: పార్లమెంట్‌తో తన ప్రభుత్వానికి నిలబెట్టే బలం సరిపోకపోతే తాను రాజీనామ చేసి వెళ్లిపోతానని శ్రీలంక ప్రధానమంత్రి మహింద్ర రాజపక్సె అన్నారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు దేశాన్ని బాగా దెబ్బతీశాయి. దీంతో దేశంలో మానవతా సంక్షోభం ఏర్పడింది.


శ్రీలంకకు చెందిన ఒక మీడియా సంస్థ రాజపక్సెను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి నిరసనలు చేయడం లేదు. ప్రత్యేక వర్గాలకు చెందిన కొంత మంది మాత్రమే ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశంలోని ఆర్థిక పరిస్థితిని మెగురుపర్చడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు. ఇక అధ్యక్సుడు గొటబయ రాజపక్స గురించి ఆయన మాట్లాడుతూ ‘‘గొటబయ రాజపక్ష ఈ దేశానికి అధ్యక్షులు. అధ్యక్షుడిగా ఆయనను గౌరవిస్తాను. నిజానికి ఆయన నా తమ్ముడు. అయితే అది వేరే విషయం. అది వ్యక్తిగత బంధం. కానీ ప్రభుత్వంలో ఇవన్నీ ఉండవు’’ అని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై మాట్లాడుతూ ‘‘ప్రజలు మమ్మల్ని మార్చాలనుకుంటే ఎన్నికల ద్వారా మార్చవచ్చు’’ అని మహింద్ర రాజపక్సె అన్నారు.

Updated Date - 2022-04-27T22:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising