ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: ముంబైలో వారు లేకపోతే... గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-07-30T20:02:03+05:30

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి (Bhagat sing koshyari) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే దేశ ఆర్థిక రాజధానిలో డబ్బేం మిగలదని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...''నేను ఇక్కడి ప్రజలకు ఒకటి చెప్పదలచుకున్నాను. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను వీడి వెళ్లితే, ముఖ్యంగా ముంబై, థానేను విడిచిపెడితే, ముంబైలో డబ్బేం మిగలదు. దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత ముంబై కోల్పోతుంది'' అని ఆయన అన్నారు. ముంబై పశ్చిమ శివార్లలోని అంధేరిలో ఒక చౌక్‌కు పేరు పెట్టే కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.


భగ్గుమన్న శివసేన..

గవర్నర్ కోష్యారి తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కనీసం గవర్నర్ ప్రకటననైనా ఖండించాలని అని ట్వీట్ చేశారు. బీజేపీ స్పాన్సర్ చేసిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే మహారాష్ట్ర ప్రజలను అవమానించడం మొదలైందని, కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించారని సంజయ్ రౌత్ తప్పుపట్టారు.

Updated Date - 2022-07-30T20:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising